రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో ఆ నేతల పరిస్థితి కూడా అలానే తయారవడం ఇప్పుడు టీడీపీ ని కలవర పెడుతుంది. పార్టీ లో ఎలాంటి కార్యకలాపాలు జరగకపోవడం తో పాటు టీడీపీ నేతలు కూడా మిన్నకుండి పోవడం తో టీడీపీ భవిష్యత్ ఎలా ఉంటుందో అని వాపోతున్నారు.. ఇక పార్టీ లోని చినబాబు, పెదబాబు లు మాత్రమే టీడీపీ కొంత హుషారుగా ఉండేందుకు కృషి చేస్తున్నారు.. అది కూడా సోషల్ మీడియా లోనే.. ఓడిపోయిన తరువాత వీరు ఎక్కువగా ట్విట్టర్ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తుండడంతో ప్రజలు కూడా వారిని అలానే ఫాలో అవడం మొదలుపెట్టారు..