నియోజకవర్గానికి సంబంధించిన పలు డిమాండ్ల పై సిఎం కెసిఆర్, మంత్రి హరీష్ రావు హామీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దుబ్బాక ప్రజల మొదటి డిమాండ్ రెవిన్యూ డివిజన్. దుబ్బాకలో ఇప్పటికే దౌల్తాబాద్, రాయపోల్, తొగుట, మిరుదొడ్డి మండలాల వ్యవసాయ శాఖ ఏడిఏ కార్యాలయం ఉంది. డివిజన్ కేంద్రం ఏర్పాటు తో ఆర్డీవో కార్యాలయంతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు వస్తే అభివృద్ధికి అవకాశం ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో ఉన్న సమస్యలను హరీష్ రావు ముందు ఉంచి పరిష్కారం చూపమంటున్నారు..