వైస్ జగన్ సీఎం అవడానికి పదేళ్లు కష్టపడ్డారని చెప్పొచ్చు.. ఎలాంటి రాజకీయ బలం లేని వేళా ఒంటరిగా ప్రజల అండతో జగన్ పార్టీ పెట్టి ప్రజల్లోకి దూసుకుపోయారు.. అయితే మొదటి ఎన్నికల్లో జగన్ గెలవలేకపోయినా రెండు సారి సారి మాత్రం అత్యధిక మెజారిటీ తో విజయం సాధించి అధికారంలోకి వచ్చారు.. అయితే జగన్ ఇంత స్థాయి కి రావడానికి అయన ఒక్కరి కృషి ఉందంటే ఎవరు ఒప్పుకోరు.. ఎందుకంటే అయన గెలవడానికి ముఖ్య కారణం ప్రజలు అయితే ప్రధాన కారణం అయన వెన్నంటి ఉన్న కొంతమంది నేతలు, కార్యకర్తలు.. వీరు ఎలాంటి స్వార్ధం లేకుండా జగన్ కోసం, పార్టీ కోసం పనిచేసిన వారే..