ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నికల్లో ఓడిపోయాం అన్న చింత కొంత కూడా లేకపోగా మళ్ళీ ప్రజల్లో నమ్మకం పెంచుకుందామన్న భావన అస్సలు వారి లో కనపడట్లేదు.. ఇప్పటికే చాల సమస్యలతో ఉన్న రాష్ట్రాన్ని, ప్రజలను గాలికి వదిలేసింది టీడీపీ. ప్రజలవద్దకు వెళ్ళడానికి వారికి ఎందుకు ఇష్టం ఉండట్లేదు తెలీదు కానీ ప్రజల్లో మాత్రం వారు రోజు రోజు కి దిగజారిపోతున్నారు.. దానికి తోడు టీడీపీ పరిస్థితి పరిస్థితి తుమ్మితే ఊడిపోయే ముక్కులా తయారైంది.. ఎప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎలా దాడి చేస్తుందో తెలియని పరిస్థితి.. ఇప్పటికే టీడీపీ నేతలు బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నారు..