మోడీకి ఏపీ పై అమితమైన ప్రేమ పొంగుతుంది.. చీటికీ మాటికీ జగన్ తో ముచ్చటిస్తూ హామీల మీద హామీలు కురిపిస్తున్నారు.. ఇక ఆంధ్రప్రదేశ్ లో వరద సృష్టించిన భీభత్సంపై మోడి సీఎం జగన్ ను ఫోన్ లో వాకబు చేశారు. వరద కారణంగా దెబ్బతిన్న పంటలకు, రహదారుల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం అన్ని విధాలుగా సహయం అందిస్తుందని ప్రధాని ముఖ్యమంత్రి జగన్ కు హామీ ఇచ్చారు. వర్షాల వలన ఇబ్బందులు ఎదుర్కుంటున్న బాధితులు త్వరగా ఈ విపత్తు నుండి కోలుకుని క్షేమంగా ఉండాలని తాను భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.