మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు విషయంలో అయినా, కొల్లు రవీంద్ర విషయంలో అయినా రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు అంటే విషయం కొంత ఉంది అన్నది అర్ధమవుతోంది కదా. ఇక ఇదే తీరున ఏపీలో ఏ పెద్ద టీడీపీ లీడర్ విషయంలో దర్యాప్తు చేసినా కక్ష అంటున్నారు. ఏకంగా అమరావతి రాజధాని భూ దందా విషయంలో కూడా ఇదే మాట. అక్కడ దందా జరగలేదని ఆ గట్టునే ఉన్న బక్క రైతును చెప్పమన్నా మొత్తానికి మొత్తం చెబుతాడు. మరి ఇవన్నీ విచారణ చేయకూడదు అంటున్నారు. ఇలా అయితే అవినీతి రహిత రాష్ట్రాన్ని ఎలా తాయారు చేయాలో అర్థం కావట్లేదు అని జగన్ సన్నిహితులు అంటున్నారు..