ప్రతి చిన్న విషయానికి పొలోమంటూ వచ్చే బీజేపీ రాష్ట్రంలో ఇంత పెద్ద ఇష్యూ అవుతున్న కదిలి రాకపోవడంతో వారి వైఖరి ఏంటో అర్థం కావట్లేదు.. గతంలో అంతర్వేది విషయంలో బీజేపీ చేసిన హంగామా మామూలుది కాదు మరి ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉందని ప్రజల ప్రశ్న.. డిల్లీలో ఉండే రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు కూడా దీని పై స్పందించకపోవడం గమనార్హం. బిజెపిలోని సోము, జివిఎల్ టిడిపి వ్యతిరేకులుగా ముద్రపడ్డారు. ఈ విషయంలో పార్టీలోని టిడిపి అనుకూల ప్రత్యర్థి సామాజిక వర్గీయులు కూడా స్పందించకపోవడం, తెలుగుదేశం మీడియాకు కనీసం లీకేజీలు కూడా ఇవ్వకపోవడం విచిత్రంగా తోస్తోంది.