వైసీపీ పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీ నే ముప్పుతిప్పలు పెడుతున్న నర్సాపురం ఎంపీ రఘు రామ రాజుకు తొలి షాక్ తగిలింది.. తానే మారుతాడు లే అని వైసీపీ అధిష్టానం ఇన్నాళ్లు రాజు గారు ఎన్ని వ్యాఖ్యలు చేసిన ఓపిక పట్టింది.. నిజం ప్రజలే తెలుసుకుంటారు..మన నేతను మనం టార్గెట్ చేస్తే మన పరువు పోతుందని ఊరుకుంటుంటే రఘు రామ రాజు మాత్రం ఎక్కడా తగ్గట్లేదు.. టీడీపీ నేతలు సైతం టార్గెట్ చేయని విధంగా సొంత పార్టీ అధినేత పై విమర్శలు కురిపిస్తూ వచ్చారు.. ఇటీవలే జగన్ త్వరలో జైలుకి వెళతాడని కూడా వ్యాఖ్యలు చేసి వైసీపీ కి తీవ్ర ఆగ్రహం తెప్పించేలా మాట్లాడాడు..