ఇటీవలే విజయవాడ కనకదుర్గమ్మ వారి ఫ్లై ఓవర్ వంతెన ప్రారంభం సందర్భంగా జగన్ మాట్లాడుతూ విశాఖ రాజధాని ప్రస్తావన మరోమారు తీసుకువచ్చారు. అది కూడా కేంద్ర మంత్రితోనే. విశాఖ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకూ అయిదు లైన్ల రహదారిని నిర్మాణం చేయమంటూ జగన్ కోరడం విశేషం. విశాఖ రాజధాని నగరానికి ఈ రహదారులు చాలా అవసరమని ఆయన చెప్పుకొచ్చారు.మొత్తానికి విశాఖ రాజధాని విషయంలో వైసీపీ వెనక్కి తగ్గిందని, ఇక రాదూ రాబోదూ అని టీడీపీ తమ్ముళ్ళు అదే పనిగా చేస్తున్న విష ప్రచారానికి బ్రేకులు వేసేలా జగన్ తాజా వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు. జగన్ విశాఖవాసుల్లో కొత్త ఆశలు నింపారని కూడా అంటున్నారు.