చింత చచ్చిన పులుపు చావలేదన్నట్లు పదవి పోయినా రాజుగారి విమర్శల ఘాటు ఇంకా తగ్గలేదని చెప్పాలి.. నిన్న రాత్రి రఘురామ రాజు మీడియాకి విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ ఆ పదవి తన స్వయంకృషితో తెచ్చుకున్నా వైసీపీ ఎంపీగా పార్టీ ద్వారా తనకి వచ్చిందని , తనని పదవి నుండి తప్పించలేదని ఏడాది గడువు ముగియడంతో తానే దయ తలచి ఇచ్చానన్నట్టు చెప్పుకొన్నారు . ఒహవేల తనని పార్టీ నుండి డిస్మిస్ చేస్తే పులివెందులలో పోటీ చేసి రెండు లక్షల ఓట్ల మెజారిటీ తెచ్చుకొంటానని సవాల్ విసిరిన రఘురామ రాజు దాన్ని అమరావతి పై రిఫరెండం గా తీసుకోవాలని కోరారు .