కరకట్ట లోని చంద్రబాబు నివాసాన్ని ఖాళీ చేయాల్సిందిగా అధికారులు నోటీసులిచ్చారు. చంద్రబాబుతో పాటు మరో 36 ఇళ్లకు నోటీసులు జారీ చేశారు. భారీ వరద వస్తుండటంతో కరకట్ట దగ్గర ఉన్న నివాసాలను ఖాళీ చేయాలని నోటీసుల్లో అధికారులు కోరారు. సెప్టెంబర్లో కూడా చంద్రబాబు నివాసానికి నోటీసులు ఇచ్చారు. గతేడాది కూడా భారీ వర్షాలు కురవడంతో ప్రకాశం బ్యారేజీకి వరద భారీగా పెరిగింది. అప్పుడు కూడా చంద్రబాబుకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇంటిని ఖాళీ చేయాలని కోరారు.కానీ అప్పుడు ఇప్పుడు చంద్రబాబు అధికారులు నోటీసులను పట్టించుకోవట్లేదు.. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేగేలా ఉంది.