ఇటీవలే టీడీపీ పోరాటం చేసిన ఓ విషయాన్నీ ఆ విజయాన్ని తన ఖాతాలోకి వేసుకోవడం జగన్ కే చెల్లింది.. అదే విజయవాడ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన విజయవాడ ఫ్లై ఓవర్.. ఈ విజయవాడ ఫ్లై ఓవర్ ఎట్టకేలకు ప్రారంభం అయింది ఇన్ని సంవత్సరాలుగా బెజవాడ ప్రజలని ట్రాఫిక్ కష్టాలకి గురి చేసిన దుర్గ గుడి ప్రాంతం, ఇప్పుడు కొత్తగా నిర్మించిన దుర్గ గుడి ఫ్లై ఓవర్ ప్రారంభించటంతో ఈ ఏడాది దసరాకి విజయవాడ ప్రజలకి ట్రాఫిక్ కష్టాలు తీర్చనుంది. పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన విజయవాడ ఫ్లై ఓవర్ ని కేంద్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి నితిన్ గడ్కారి ఆన్ లైన్ లో ప్రారంభించారు. సిఎం జగన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే.