రాజకీయాల్లో నేతలకు విరోధాలు, విరోధులు తక్కువేం లేరు.. ఏ నియోజక వర్గంలో అయినా ఎమ్మెల్యే కు ప్రత్యర్థులు ఉంటారు.. సొంత పార్టీ నుంచి ఉంటే మాత్రం అది పెద్ద తలనొప్పి ని చెప్పాలి.. అలా వల్లభనేని వంశీ , యార్లగడ్డ వెంకట్రావ్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం కొనసాగేది.. వీరు ఒకప్పుడు అపోజిట్ పార్టీ లో ఉన్నప్పుడు పోటీ హోరా హోరీ గా ఉండేది కానీ టీడీపీ ఎంఎల్ఏ వల్లభనేని వంశీ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై తిరుగుబాటు లేవదీశారు. తర్వాత పార్టీకి దూరమైపోయి వైసీపీకి దగ్గరయ్యారు.