పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షులను పార్టీ అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నియోజకవర్గాల్లో బీసీ సామాజిక వర్గాలకు ఇద్దరు ఇంచార్జ్ లు, ఎస్సీ, ఎస్టీకి ఇద్దరు ఇంచార్జ్ లను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా నియోజకవర్గాల్లో బీసీలకు, వెనుకబడిన వర్గాలకు మరింతగా దగ్గర కావొచ్చు అనేది చంద్రబాబు భావన. ఇందులో మహిళలకు కూడా పెద్ద పీట వేయనున్నారు. సంక్షేమ కార్యక్రమాల లోపాలను, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించే విధంగా ఈ వ్యవస్థలను పార్టీ అధిష్టానం ఏర్పాటు చేస్తుంది