జగన్ విజయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎంతో కొంత ప్రధాన పాత్ర వహించారని చెప్పొచ్చు.. ఓ బహిరంగ సభలో ప్రశాంత్ కిషోర్‌ను ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హేళనగా మాట్లాడారు. ఎవరైనా వ్యూహకర్తను పెట్టుకుంటారా..? పెట్టుకుంటే మాత్రం బయటకు చెబుతారా..? అంటూ వైఎస్ జగన్ చర్యను ఎగతాళి చేశారు. కనీ ఇప్పుడు అదే వ్యూహాన్ని చంద్రబాబు పాటిస్తుండడం ఆశ్చర్యంగా ఉంది..ప్రశాంత్ కిషోర్ మాదిరిగా.. పంజాబ్‌కు చెందిన రాబిన్ శర్మ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ వ్యూహకర్తగా పని చేస్తున్నారని ప్రచారం సాగుతోంది.