జగన్ ఇటీవలే బీసీ లకు గతంలో ఎప్పుడు లేనంతగా దగ్గరయిపోయాడు..2019 ఎన్నికల్లో అన్ని సామాజికవర్గ ప్రజలు వైఎస్ జగన్ను ఆదరించారు. ఈ ఎన్నికల్లోనే తమకు ఆది నుంచి వెన్నంటి ఉన్న బీసీలు దూరం అవుతున్నారని టీడీపీ నేతలకు అవగతమైంది. తనను ఆదిరించిన అన్ని సామాజికవర్గ ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో వైఎస్ జగన్.. తాను ఇచ్చిన హామీలను తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీసీలకు ఆర్థికంగా, రాజకీయంగా మునుపెన్నడూలేనంతగా లబ్ధి జరుగుతోంది.