ప్రతిపక్షాలు సైతం ఈ ఎన్నికలో విజయం సాధించేందుకు తమ అస్త్రాలను ఉపయోగిస్తుంది. బీజేపీ అయితే ఒకడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ ని రంగంలోకి దించే ఆలోచన చేస్తుంది. ఇటీవలి కాలంలో జనసేన పార్టీ కన్నా.. బీజేపీ గురించే ఎక్కువ ట్వీట్లు.. ప్రకటనలు చేస్తున్న ఆయనను గరిష్టంగా ఉపయోగించుకోవాలని బీజేపీ నేతలు ఆలోచిస్తున్నారు. అందుకే తెలంగాణ బీజేపీ నేతలు ఆయన్ని దుబ్బాకలో ప్రచారానికి వినియోగించుకోనున్నారు.. బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు. గతంలోనూ ఆయన అక్కడ పోటీ చేశారు. గ్రామగ్రామన ఆయన అనుచరణగణాన్ని ఏర్పాటు చేసుకున్నారు.