టెక్కలి ఎమ్మెల్యే గా వరుసగా గెలుస్తున్న కింజరాపు అచ్చెం నాయుడు కి అక్కడ ప్రజల మద్దతు బాగానే ఉన్నా స్కాం చేసి అవినీతి కి పాల్పడ్డాడని అపవాదు అయితే ఉంది.. ఇక ఇవేమీ పట్టించుకోకుండా చంద్రబాబు కళా వెంకట్రావ్ ను తప్పించి టీడీపీ కిరీటం ఈయనకు పెట్టారు.. ఇక 27 మందితో టీడీపీ కేంద్ర కమిటీ.. ఇరవై మందితో పొలిట్ బ్యూరోను ఏర్పాటు చేశారు. కేంద్ర కమిటీలో ముగ్గురు మహిళలకు ఉపాధ్యక్ష పదవులు కల్పించారు. పొలిట్ బ్యూరో పదవికి స్వచ్చందంగా రాజీనామా చేసిన గల్లా అరుణకుమారిని ఉపాధ్యక్షురాలిగా నియమించారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు, లోకేష్, నిమ్మల , వర్ల రామయ్య సహా.. మరో నలుగురికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.