మొదటి ఏడాది సంక్షేమ పథకాల ఫై ఫోకస్ పెట్టిన జగన్ రెండో ఏడాది అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టారు. నిర్ణయం తీసుకున్నదే తడవుగా వెంటనే వాటిని ఆచరణలో పెడుతున్నారు. 972 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్న ఏపీలో పోర్టులు, రేవుల అభివృద్ధికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్ల తరబడి ప్రతిపాదనల దశలోనే ఉన్న పోర్టులు, రేవుల నిర్మాణాన్ని సీఎం వైఎస్ జగన్.. ఆచరణలో పెడుతున్నారు. ఇటీవల మంత్రివర్గం ఆమోదం తెలపడంతో.. ప్రకాశం జిల్లా రామాయపట్నం, శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టులతోపాటు నాలుగు చేపల రేవుల నిర్మాణానికి టెండరు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వాటిని జుడీషియల్ రివ్యూకు పంపారు.