ఇటీవలే జరిగిన ప్రాజెక్టుల్లో ప్రమాదాలు.. హైదరాబాద్ వరదలు తెలంగాణ రాష్ట్ర సమితిని డిఫెన్స్‌లో పడేస్తున్నాయి అని చెప్పొచ్చు.. వాటి వైఫల్యాలకు కూడ కాంగ్రెస్ ను నిందిస్తున్నారు తెరాస నాయకులు.కొన్నాళ్ల కిందట వరకూ.. టీఆర్ఎస్ ఇలా వాదనలు వినిపిస్తే.. కాస్త ఎఫెక్టివ్‌గా ఉండేది. కానీ ఎప్పటికప్పుడు… ప్రజలకు కష్టాలొచ్చినప్పుడల్లా.. వారి కష్టాలను తీర్చేప్రయత్నం చేయకుండా… పక్కనోళ్లపై నిందలేసి.. తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలకైనా చిరాకేస్తుంది. ఇప్పుడా పరిస్థితి వచ్చింది. ఇంత కన్నా మెరుగైన వ్యూహాన్ని టీఆర్ఎస్ నేతలు.. సిద్ధం చేసుకోవాల్సి ఉంది.