మూడు రాజధానులకు తెలుగు దేశంలో మిగతా నేతలు ఎలా స్పందిస్తారో తెలీదుగాని అచ్చన్న మాత్రం ఖచ్చితంగా నో చెప్పక తప్పదు. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధిగా ఆయన విశాఖను రాజధానిగా వద్దన్నారంటే ఆయన రాజకీయ సమాధికి ఆయనే సొంతంగా ఇటుకలు పేర్చుకున్నట్లు అవుతుంది. చంద్రబాబు పక్షపాత వైఖరిని నిరసిస్తూ టిడిపి విశాఖ ఎమ్మెల్యే గణేష్ కుమార్ ఏకంగా టిడిపికి రాజీనామా చేసి విశాఖను రాజధానిగా చేసేందుకు ఆనందం వ్యక్తం చేస్తూ జగన్ కు మద్దతు తెలిపారు. ఇంకొందరు ఎమ్మెల్యేలు కూడా ఇదే దారిలో ఉన్నారని సమాచారం. మరి ఈ రెండిటిని బాలన్స్ చేస్తూ అచ్చెన్నా ఎలా ముందుకు వెళతారో చూడాలి..