సంక్షేమ పథకాల అమలుకు క్యాలెండర్ను ప్రకటించారు. రెండు నెలల కాలంలో ఏ ఏ పథకాలు ఎప్పుడు అమలు చేయబోతున్నామన్నది సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. అక్టోబర్ 21 న వైఎస్సార్ బీమా పథకం, అక్టోబర్ 27 న వైఎస్సార్ రైతు భరోసా రెండో విడత, నవంబర్ 6 జగనన్న తోడు, నవంబర్ 10 న రైతులకు సున్నా వడ్డీ రుణాలు, నవంబర్ 13 ఆరోగ్యశ్రీ పథకం 2వేల వ్యాధులకు మిగిలిన ఆరు జిల్లాలకు వర్తింపు, నవంబర్ 17 జగనన్న వసతి దీవెన పథకాలు ప్రారంభిస్తున్నారు..