వైఎస్ జగన్ చెప్పిన మోసపు మాటలు విని కొంత మంది బీసీలు వైసీపీకి ఓటేశారని చెప్పుకొస్తున్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల పథకాలు ఆగిపోవడం, అడుగడుగునా అణిచివేయడంతో మళ్లీ బీసీలు టీడీపీ వైపు చూస్తున్నారని మూసపద్ధతిలో విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పాత చింతకాయ విధానంతో కూడిన రాజకీయాలు చేయడం వల్ల ప్రస్తుత సమయంలో ఎలాంటి ప్రయోజనం ఉండబోదనేది అందరూ చెప్పే మాట.