తమకు ఆది నుంచి అండగా ఉన్నా బీసీలు దూరం అయ్యారని బాబు సహా ఆ పార్టీలో ఉన్న బీసీ నేతలైన యనమల రామకృష్ణుడు, కింజారపు అచ్చెం నాయుడు సహా తదితర నేతలు ఒప్పుకున్నారు. తిరిగి బీసీలను మళ్లీ ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఏ చిన్న అవకాశం దొరికినా.. బీసీలతో ముడిపెట్టి మీడియాకు ప్రకటనలు విడుదల చేస్తున్నారు. అదే సమయంలో బీసీలకు వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాజకీయ పరమైన విధానాలపై విమర్శలు చేస్తున్నారు. అలా అయితే బీసీ లు ఎలా వారి దగ్గరకి వస్తరన్నది అసలు ప్రశ్న