తమపైన ఏ విమర్శ వచ్చినా కూడా తెలివిగా తెలుగు జనాల మీదకు మళ్ళించడంలో టీడీపీ తమ్ముళ్ళు నిపుణులు. తెలుగుదేశం మీద ప్రత్యర్ధులు విమర్శలు చేస్తే ఇది తెలుగు జాతి మీద దాడి అని అనగలిగే ఏకైక పార్టీ టీడీపీ ఒక్కటే. ఇపుడు తెలుగుదేశం పార్టీ ఈ ప్రచారాన్ని ఎంచుకుంది. దాన్ని జనంలోకి పోనిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని కూడా ఆశపడుతోంది.జనం ఎవరు వైపు ఉన్నారో లోకమంతా చాటాక కూడా వారు మా వైపే అంటూ హిప్నటైజ్ చేస్తూ టీడీపీ కొత్త పాలిట్రిక్స్ నే ఏపీలో చూపిస్తోంది. మరి దీనికి ధీటుగా వైసీపీ నుంచి రియాక్షన్స్ ఉంటాయా అన్నదే ఇక్కడ పాయింటే.