రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉన్న బీజేపీ జాతీయ నాయకత్వం.. ఆదిశగా కావాల్సిన కార్యాచరణను తనదైన శైలిలో అమలు చేస్తోంది. సోము వీర్రాజు నాయకత్వంలో ఏపీ లో పార్టీ కొంత కొంత బలపడుతుందని చెప్పొచ్చు.. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడానికి బీజేపీ పార్టీ ఎంత ఆసక్తి గా ఉందంటే ఇప్పటికిప్పుడు ప్రజలు అధికారం ఇస్తే చేపట్టే ఆలోచనలో ఉంది.. అయితే వెనుకా ముందు చూసుకుకోకుండా ఎలా బీజేపీ అధికారాన్ని చేపడుతుందన్నదే ప్రశ్న..