స్థానిక ఎన్నికల విషయంలో చంద్రబాబు తెలివిగా వ్యవహరిస్తున్నాడని తెలుస్తుంది..స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయా రావా అనేది పక్కన పెడితే వస్తే రాజకీయ పార్టీలు ఏ విధంగా వ్యవహరిస్తాయి అనే దానిపైనే రాజకీయ వర్గాల్లో ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి.ఏది ఏమైనా ఈ ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ రాజకీయంగా సిద్ధమవుతోంది. ఎంపీ గల్లా జయదేవ్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. దసరా తర్వాత గల్లా జయదేవ్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేసే అవకాశం ఉంది.