అమిత్ షాకు ఫోన్ చేసి పరామర్శించిన తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్న కేంద్ర మంత్రి గోయల్‌ను కూడా ఫోన్లో పలకరించారు. కిడ్నీలో రాళ్లు రావడంతో గోయల్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. బీజేపీతో పరిచయాలు పెంచుకోవడానికి చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని వీటి ద్వారా తెలుసుకోవచ్చు. ఇందులో రహస్యమేం లేదు. చంద్రబాబు మాటలు కలిపితే… ఎంతటి వారిననయినా.. తన ప్రతిపాదనలకు అంగీకరింపచేస్తారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. మరి వచ్చే ఎన్నికల నాటికీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబు కి ఈ ఎత్తుగడ ఏవిధంగా ఉపయోగపడుతుందో చూడాలి