ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను ఇక్కడకి పంపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్లలో ఐక్యత లేదు కానీ… దుబ్బాకలో మాత్రం ఎవరికి వారు కష్టపడి.. తమ ప్రతాపం చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అగ్రనేతలంతా తలా ఓ మండలం బాధ్యత తీసుకోవడంతో.. ఆయా మండలాల్లో మెజార్టీ తెప్పించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో వారంతా.. శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పీసీసీ అధ్యక్ష రేస్ నడుస్తోంది. ఈ రేసులో నెగ్గాలంటే… కొత్తగా తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ అయిన మాణిగం ఠాకూర్‌ని మెప్పించాలి. ఆయనను మెప్పించాలంటే.. పొగడ్తలతో కావడంలేదు. పనితీరుతోనే సాధ్యం. ఆ విషయం ఇప్పటికే సీనియర్లకు స్పష్టమయింది.