రాజకీయాల్లో ఏది చేయాలన్న కొంత కష్టంతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి.. వాస్తవానికి అది ఇక్కడే కాదు ఎక్కడైనా వర్తిస్తుంది. అయితే రాజకీయాల్లో మాత్రం సుడి ఉంటేనే ఇక్కడ రాణిస్తారు.. లేదంటే క్షణాల్లోనే కనుమరుగైపోతారు. ఒక నిర్ణయం తమ రాజకీయ జీవితాన్నే మారుస్తుంది అనడానికి అచ్చెన్నానే ఉదాహరణ.. మొన్నటిదాకా జైలునుండి వస్తాడో రాడో అనుకున్న అచ్చెన్న సడెన్ గా టీడీపీ అధ్యక్షుడయిపోయాడు బాగానే సెటిల్ అయ్యాడు.. ఇటీవలే టీడీపీ పార్టీ కి అధ్యక్షుడయ్యాడు అచ్చెన్నాయుడు..అయితే పదవి చేపట్టగానే కొంత హడావుడి చేసే ప్రయత్నంలో అచ్చెన్న వైసీపీ పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు..