అవినీతి అధికారులకు, నాయకులకు చుక్కలు చూపెట్టే విధంగా ఓ ప్లాన్ వేశారు జగన్.. రాష్ట్రంలో అవినీతిపై ఫిర్యాదులకు ప్రత్యేక కాల్ సెంటర్ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఎవరైనా లంచం అడిగితే 14400కి కాల్ చేయొచ్చని సూచించారు. టౌన్ ప్లానింగ్, సబ్ రిజిస్ట్రార్, ఎమ్మార్వో, ఎండీఓ కార్యాలయాల్లో అవినీతి ఆనవాళ్లు ఉండకుండా పకడ్బందీ వ్యవస్థను జగన్ రూపొందించారు. ఏపీలో అవలంబిస్తున్న ఈ విధానాలన్నీ జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతున్నాయి. ఏదేమైనా జగన్ అవినీతి ని అంతమొందించడానికి ఓ చక్కటి ఆలోచన చేశారని చెప్పొచ్చు..