టీడీపీ లో కీలక నేత అయిన బోండా ఉమా త్వరలో పార్టీ మారబోతున్నాడని వార్తలు ఇప్పుడు ఆసక్తి కరంగా ఉన్నాయి.. దాంతో ఇటీవల ప్రకటించిన పార్టీ కార్యనిర్వాహక వర్గంలో తనకు తగిన హోదా ఇవ్వలేదని బోండా అలకపూనినట్టు కనిపిస్తోంది. చివరకు చంద్రబాబు తీరు మీద ఆయన అసహనంతో ఉన్నారని సన్నిహితులు అంటున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ జగన్ ని ఎదుర్కోవడానికి సిద్ధపడిన తనకు తగిన హోదా రాలేదని వాపోతున్నట్టు చెబుతున్నారు. దానిని గ్రహించిన టీడీపీ అధినేత నేరుగా బోండా ఉమాకి ఫోన్ చేసి వివరణ ఇచ్చినట్టు కూడా చెబుతున్నారు.