దుబ్బాక ఉప ఎన్నికల విషయంలో అన్ని పార్టీ లకు హోరా హోరీ తప్పదని తెలుస్తుంది. కేసీఆర్ ఈ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. స్వయంగా దుబ్బాక మండలానికి తానే బాధ్యుడిగా ఉంటున్నారు. తనకు సన్నిహితులైన ఇతర నేతలకు ఇతర మండలాల బాధ్యతలు ఇచ్చారు. అభ్యర్థిని కూడా తానే ఎంపిక చేశారు. ఒక విధంగా తెలంగాణాలో ఇప్పుడు ఆసక్తికర రాజకీయం కొనసాగుతుందని చెప్పొచ్చు.. ఓ వైపు దుబ్బాక ఉప ఎన్నిక, మరో వైపు గ్రేటర్ ఎన్నికలు, ఇంకో వైపు ఎమ్మెల్సీ ఎన్నికలతో తెలంగాణ లో రాజకీయం రోజు రోజు కు ఎంతో ఆసక్తి కరంగా మారుతున్నాయి..