బీజేపీ ఇప్పటికిప్పుడు బలపడాలని ఏం కోరుకోవట్లేదని ఆపార్టీ అవలంభిస్తున్న విధానాలను చూస్తే అర్థం అవుతుంది.. మొదట్లో ఉండీ ఉండనట్లే బీజేపీ పార్టీ తన రాజకీయ కార్యకలాపాలు ఏపీలో కొనసాగించేది.. దానికి తోడు అప్పటి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కూడా పెద్ద గా ఎవరికీ తెలియక పోవడంతో , విమర్శలు కూడా ఎక్కువ చేయకపోవడంతో పార్టీ పెద్ద గా లైం లైట్ లోకి రాలేదు.. అప్పుడో ఇప్పుడో జీవీఎల్ నరసింహ రావు లాంటి కొంతమంది నేతలు విమర్శలు చేస్తే ఓహో బీజేపీ పార్టీ ఏపీలో ఉందా అని అనిపించేది..