తిరుపతి ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్నామంటూ అందరికన్నా ముందు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించేశారు. జనసేన నుండి ఈమధ్య బీజేపీలో చేరిన మాజీమంత్రి రావెల కిషోర్ బాబు పోటీ చేసే విషయంలో బాగా ఆసక్తిగా ఉన్నారట..  కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత పనబాక లక్ష్మి టీడీపీకి రాజీనామా చేసేసి కమలం కండువా కప్పుకోబోతున్నట్లు తెలిసింది. దాంతో పనబాక బీజేపీలో చేరి తిరుపతి ఉపఎన్నికల్లో పోటీ చేయటానికి దాదాపు లైన్ క్లియర్ అయిపోయినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ ఇద్దరిలో టికెట్ ఎవరికీ దక్కుతుందో చూడాలి..