రాజకీయ పక్షాలతో ఎన్నికల సంఘం సంయుక్త సమావేశాలు నిర్వహిస్తుంది. అన్ని పార్టీల అభిప్రాయాలను బహిరంగంగానే స్వీకరిస్తున్నారు. ఆయా పార్టీలు తమ విధానాలు, రాజకీయ అవసరాల ఆధారంగా తమ అభిప్రాయం చెప్పడం, మరిన్ని సూచనలు చేయడం చాలాకాలంగా వస్తున్న ఆనవాయితీ. కానీ నిమ్మగడ్డ మాత్రం దానికి భిన్నమైన దారిలో సాగుతున్నారు. ఒక్కో పార్టీని వరుసగా పిలుస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులు ఒక్కొక్కరితో ఎస్ఈసీ సమావేశమవుతారు. వారి అభిప్రాయాలను తెలుసుకుంటారని వెల్లడించారు.