దుబ్బాక ఉప ఎన్నిక కోసం అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి.. ప్రతిపక్షాల విమర్శలతో, ధర్నాలతో రోజు రోజు కి అక్కడ రాజకీయ వాతావరణం మారిపోతుంది.. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ అక్కడ అధికార పార్టీ పై దుమ్మెత్తి పొస్తుండగా బీజేపీ కూడా తెరాస ని అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది.. నిజానికి ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అక్కడి రాజకీయం కాస్త వేడిగా మారిపోయింది అని చెప్పొచ్చు..ఇతర పార్టీ లు ప్రత్యర్థి పార్టీ పై విమర్శలు చేస్తూ ఎదుటి పార్టీ ని కృంగదీసే ప్రయత్నం చేస్తున్నాయి.. చేరికలు ఒక పార్టీ నుంచి మరో పార్టీ కి ఎక్కువవుతున్న నేపథ్యంలో ఏ పార్టీ ఎప్పుడు పుంజు కుంటుందో అర్థం కావట్లేదు.