పార్టీ బలాన్ని పెంచడానికి, ప్రజలలో నమ్మకాన్ని పెంచడానికి చంద్రబాబు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. పార్లమెంటరీ పదవులు , పార్లమెంటరీ మహిళా కమిటీలని, రాష్ట్ర కమిటీ, పొలిట్ బ్యూరో, జాతీయ పదవులు అంటూ కొత్త కొత్త పదవులు సృష్టించి అందులో టీడీపీ నేతలను నియమించి అధికార ప్రభుత్వం కంటే ఎక్కువ హడావుడి చేసే ప్రయత్నం చేస్తున్నారు.. అంతేకాకుండా తమ పార్టీ పై కమ్మ ముద్ర చాలా ఉందని అందరికి తెలిసిందే.. దాన్ని చెరిపేసి విధంగా అయన ప్రయత్నాలు మొదలుపెట్టారు.. వాస్తవానికి చంద్రబాబు ను ఓడించిన ముఖ్య కారణం ఇదే.. టీడీపీ బీసీ లను పట్టించుకోవట్లేదని చాలావరకు బీసీ ల ఓట్లు వైసీపీ కి పడ్డాయి..