బాహుబలి సినిమా లో రాజు ని ఎవరిని చేయాలి అన్న అయోమయం నెలకొన్నప్పుడు కాలకేయ తో యుద్ధం లో ఎవరు గెలిస్తే వారికే రాజు అయ్యే ఛాన్స్ అని శివగామి చెప్పింది. ఇప్పుడు అలాంటి పరిస్థితీ తెలంగాణ లో నెలకొంది.. కేసీఆర్ తర్వాత రాష్ట్రానికి అయ్యే ముఖ్యమంత్రి ఎవరనేది ఇప్పటికి కొంత అయోమయం అయితే ఉంది.. కేసీఆర్ కొడుకు కేటీఆర్ , అల్లుడు హరీష్ రావు లలో పార్టీ తరపున ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎవరికీ ఉంది అంటే ఎవరు చెప్పలేరు.. ఎందుకంటే ఎవరి బలాలు వారికి ఉన్నాయి.. అయితే కేసీఆర్ కొడుకు అయిన కేటీఆర్ కే ఈ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పొచ్చు..