తెలంగాణ లో సరైన ప్రతిపక్షం లేదని తెలంగాణ వచ్చినప్పటినుంచి వినిపిస్తున్న మాట.. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో రేపో మాపో ఉన్నట్లు కనిపిస్తుంది.. ఎందుకంటే ఆ పార్టీ లో సరైన నాయకుడు లేదు.. ఉన్నా సీనియర్ ల డామినేషన్ తో వారు కనుమరుగైపోతున్నారు.. దాంతో సహజంగా కాంగ్రెస్ బలహీనముగ మారిపోయింది.. అయితే అధికార పార్టీ ఈ విషయంలో చాలా డిఫరెంట్ గా ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత తిరుగులేని శక్తిగా ఎదిగింది టి.ఆర్.ఎస్ పార్టీ..మొదటినుంచి తెలంగాణా ప్రజలకు గులాబీ పార్టీ విధేయతగా ఉంటు వస్తుంది..అందుకే ప్రజలు పార్టీ ను గెలిపిస్తూ వస్తున్నారు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు..