తెలంగాణాలో ని దుబ్బాక ఉప ఎన్నికలు దగ్గరికోస్తున్న కొద్దీ పార్టీ లు ప్రజల్లోకి దూసుకుపోవడానికి కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ ఎలాగైనా గెలవడానికి నాయకులు అక్కడి ప్రజలకు వరాల మీద వరాల కురిపిస్తున్నారు.. అధికారంలో లేని కాంగ్రెస్, బీజేపీ పార్టీ లు ఇక్కడ హామీలను కురిపించడం కొంత హాస్యాస్పదంగా ఉన్నా అధికార పార్టీ ప్రజలను ఎలా సంతృప్తి పరుస్తుంది అనేదే అసలు ప్రశ్న.. ఈ ఎన్నికను అన్ని పార్టీ లు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎలాగైనా ఇక్కడ గెలవాలని కృషి చేస్తున్నాయి.. దాంతో ప్రజలకు దగ్గరవడానికి అన్ని పార్టీ లు అక్కడి ప్రజలకు వరాలు కురిపిస్తున్నారు..