వైసీపీ పార్టీ తరపున గెలిచి రెబల్ గా మారిపోయిన రఘు రామ కృష్ణం రాజు పార్టీ విధానాలని కుంగ లో తొక్కి పార్టీ శ్రేణులను తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే.. పార్టీ లో ఏదైనా అసంతృప్తి ఉందా అంటే అది ఈయన విషయమే.. టీడీపీ లో చంద్రబాబు లాంటి వాళ్ళను నిలువరిస్తున్న వైసీపీ నేతలు సొంత పార్టీ ఎంపీ ని మాత్రం ఆపలేకపోతున్నారు.. టీడీపీ ని నాయనో భయానో భయపెట్టి నోర్లు మూయించిన రాజు గారిని మాత్రం ఎక్కడా అడ్డుకోలేకపోతున్నారు.. ఆయన అవినీతి గురించి బయట పెడదామా అంటే సొంత పార్టీ నేత అయిపోయారు.. పోనీ బుజ్జగిద్దమా అంటే వైసీపీ అంటే ఆమడ దూరం వెళ్తున్నారు..