దుబ్బాక లో ఎన్నికల సెగ ఎంతవరకు దారి తీసింది అంటే ఏకంగా కేంద్ర బలగాలు వచ్చి దుబ్బాక లో తిష్ట వేసేంత అక్కడ పరిస్థితి మారిపోయింది.. మొన్నటి దాకా దుబ్బాక లోఎంతో స్పోర్టివ్ గా ఎన్నికల ప్రచారాలు సభలు, ర్యాలీలు జరిగాయి.. అన్ని రాష్ట్రాల్లో జరిగినట్లే ఇక్కడ విమర్శలు, దాడులు జరిగాయి.. అయితే బీజేపీ నేత రఘునందన్ బంధువుల ఇంట్లో సోదాలు, కారులో డబ్బు దొరకడం వంటి పరిణామాలు చూస్తుంటే బీజేపీ కేంద్రాన్ని సహాయం కోరగా వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది.. పోలీస్ అబ్జర్వర్ గా తమిళనాడుకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ ను నియమించింది. పోలింగ్ అబ్జర్వర్లను నియమించాల్సిన చోట. పోలీస్ అబ్జర్వర్ను నియమించారు. దీంతో వచ్చే నెల 3న పోలింగ్ జరగబోయే దుబ్బాక ఉప ఎన్నిక దేశ వ్యాప్తంగానే హాట్ టాపిక్ గా మారింది.