తెలంగాణాలో పుంజుకున్న బీజేపీ పార్టీ ఏపీ లో కూడా బలపడాలని తీవ్రంగా కృషి చేస్తుంది. ఆ క్రమంలోనే ఏపీ లో నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఎన్నిక చేసి పెద్ద సాహసం చేసిందని చెప్పాలి.. ఎందుకంటే అప్పటివరకు ఉన్న కన్నా లక్మి నారాయణ ను తీసి సోము కి అధ్యక్ష పదవి ఇవ్వడం పెద్ద రిస్క్ అని చెప్పాలి.. అయితే సోము వచ్చాకే రోజు రోజు కి పార్టీ బలపడుతుందని బీజేపీ నేతలు అంటున్నారు.. నిజానికి సోము పదవి చేపట్టాక ప్రజల్లోకి బీజేపీ పార్టీ వేగంగా దూసుకెళ్లింది.. ముఖ్యంగా టీడీపీ వీక్ గా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఇప్పుడు ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది.. కేంద్రంలో అధికారంలో ఉన్నా అక్కడ సపోర్ట్ సరిగ్గా లేకపోయినా రాష్ట్రంలో తామే అధికారంలో ఉన్న పార్టీ మాదిరి సోము ఏపీ లో బీజేపీ బలోపేతానికి చాలా చర్యలు చేపట్టి అందులో సక్సెస్ అయ్యాడని చెప్పాలి..