తెలంగాణ లో ఓ వైపు దుబ్బాక ఎన్నికలు, మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమాయత్తం తో అక్కడ రాజకీయాలు ఎంతో ఆసక్తి కరంగా మారాయి.. ఇప్పటివరకు అంత తమవైపుకు ఉంది అనుకున్న అధికార టీఆరెస్ పార్టీ కి ఒక్కసారి గా వరదల రూపంలో భారీ చెడ్డ పేరును మూటగట్టుకుంది. ఇటీవల కురిసిన వరదలతో అధికార పార్టీ పై బాధితులు మండిపడుతున్నారు. ఏడేళ్లుగా అధికారంలో ఉంటూ వరదలు వస్తే ఎలా అన్న ఆలోచన లేకుండా పార్టీ ఇలా చేయడమేంటి అని ప్రశ్నిస్తున్నారు..అంతేకాదు ప్రతిపక్షలు కూడా దీన్ని రాజకీయంగా వాడుకుని గులాబీ పార్టీ ను చెడు చేయడానికి ప్రయత్నించింది..