నమ్ముకున్న వారిని దగా చేయడంలో చంద్రబాబు కు మంచి రికార్డు ఉంది.. సొంత మామ విషయంలోనూ తనకు ఎలాంటి అభిమానాలు లేవని చంద్రబాబు చాటిచెప్పారు.. అయితే అది అప్పటి సంగతి.. అప్పుడంటే అన్ని పరిస్థితులు తనకు అనుకూలించాయి నడిచింది.. కానీ ఇప్పుడు కూడా చంద్రబాబు తనను నమ్ముకున్న వారిని దగ్గ చేస్తున్నారు.. అంతేకాదు పార్టీ లో వారికి స్థానం లేకుండా చేస్తున్నారు. ఎంత అధినేత అయితే మాత్రం పార్టీ ని కష్టాల్లో ఉన్నప్పుడు బయటకి తీసుకొచ్చిన వారిని కూడా పార్టీ లో లేకుండా చేస్తూ వారిని అవమానించబడే లా చేస్తున్నారు.. ఈ విషయంలో రాయపాటి కి పెద్ద అవమానం చంద్రబాబు చేశారని చెప్పొచ్చు..