ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వాలు ఎంత అన్యాయం చేస్తున్నాయో అందరికి తెలిసిందే.. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఏపీ కి ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఆ తర్వాత ఆ ప్రభుత్వం అధికారంలోకి రాకపోవడంతో బీజేపీ ని అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.. అయితే ఎంత మొత్తుకున్నా బీజేపీ ప్రభుత్వం రాష్ట్రం మాట వినిపించుకోలేదు.. అయితే 2014 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ఏపీ కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు తన మాటను నిలబెట్టుకోలేదు కదా ఇస్తామన్న స్పెషల్ ప్యాకేజ్ జాడ ఇప్పటికీ లేదు..