వైసీపీ పార్టీ అధికారంలోకి రావడానికి అభ్యర్థుల పేరు, ప్రతిష్టలకన్నా ఎక్కువ జగన్ ఇమేజ్ తోడయ్యింది అన్న వాదన ను ఎవరు కాదనలేం. జగన్ ఏపీ లో ఉన్న ఫేమ్ అలాంటిది.. చాలామంది జగన్ మొహం చూసే నియోజకవర్గంలో ఎవరో నిలబడ్డారో కూడా తెలీకుండా వైసీపీ కి ఓటువేశారు అంటే నమ్మక తప్పదు.. చాలామందికి తమ నియోజక వర్గంలో పోటీ చేసే వ్యక్తి పేరు కూడా పూర్తి గా తెలీదు.. దీన్ని బట్టి జగన్ మేనియా ప్రజల్లో ఏ లెవెల్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు.. ఇక ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వందకు వంద శాతం నిలబెడుతున్న జగన్ ఆ క్రెడిట్ తానొక్కడినే తీసుకోకుండా అభ్యర్థులందరికీ, కార్యకర్తలందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు..