పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఎంతటి దారుణ ఓటమి ని చవి చూశారో అందరికి తెలిసిందే. ఒక్క సీటు తో దేవుడా అని పరువు దక్కించుకున్న పవన్ కళ్యాణ్ తాను సొంతం గా ఒక్క సీటు ను గెలుచుకోలేకపోయారు.. అయితే ఒక్క సీటు వచ్చినా ఎక్కడ కృంగిపోకుండా మళ్ళీ రాజకీయాల్లో కొనసాగారు.. సోలో గా ఉంటే గుర్తింపు ఉండదని భావించి బీజేపీ తో పొత్తు గా ఉండి ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ వస్తున్నారు.. అవసరమున్నప్పుడు ప్రజల్లోకి వెళ్లి ప్రశ్నిస్తున్నారు..అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని పరిస్థుతుల రీత్యా బీజేపీ తో భేదాభిప్రాయాలు రాగ బీజేపీ తో జనసేన పొత్తు వీగిపోతుందని ఎప్పటికప్పుడు వార్తలు వచ్చినా అలా జరగకపోవడం తో పార్టీ పొత్తులో ఉంటుందని భావించారు అంతా..