జగన్ గెలుపు రాష్ట్రంలో ఒక విప్లమని చెప్పాలి.. అందుకు తగ్గట్లు అయన పాలనా కూడా ఇప్పుడు ఎంతో బ్రహ్మాండం గా ఉంది.. ప్రజలు అయన చేసిన సేవలకు బ్రహ్మరథం పడుతున్నారు.. గెలుస్తాడా గెలవాడా అన్న స్థాయి నుంచి బంపర్ మెజారిటీ తో గెలిచే స్థాయికి వచ్చిన జగన్ టీడీపీ కి ఎన్నో నిద్రలేని రాత్రులను మిగిల్చాడు.. అంతేకాదు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన టీడీపీ బకాసురులను పనిపాట కార్యక్రమాన్ని మొదలు పెట్టి అటునుంచి వారిని లేకుండా చేస్తున్నారు.. ప్రజలనుంచి దోచుకుని ప్రజలను అణిచివేసే స్థాయికి వచ్చారు టీడీపీ నేతలు.. దాంతో ప్రజలు టీడీపీ ని అధికారంలోకి రానివ్వొద్దని డిసైడ్ అయ్యారు.. దాంతో ప్రత్యామ్నాయంగా కనిపించిన జగన్ ని గెలిపించి ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు..